ఎంసెట్ లీకేజీ కేసులో చైతన్య జూనియర్ కాలేజీ డీన్, ఏజెంట్ అరెస్ట్

0
241


హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ లీకేజీ కేసులో సీఐడీ అధికారులు గురువారం మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 2016లో వెలుగు చూసిన ఈ స్కాం అప్పట్లో తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పటికే అరవై మందికి పైగా అరెస్టు చేశారు. ఇప్పుడు మరో ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ చైతన్యపురి చైతన్య కాలేజీ డీన్ వెలేటి వాసుబాబును అరెస్టు చేశారు. ఆయనతో పాటు కమ్మ వెంకటశివనారాయణ అరెస్టయ్యారు. వెంకటనారాయణ.. నారాయణ, చైతన్య కాలేజీలలో విద్యార్థులను చేర్పించే ఏజెంట్‌గా పని చేస్తున్నాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here