క్వార్టర్స్‌లో సింధు

0
227


జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 21-17, 21-14 తేడాతో అయ ఒహోరీ(జపాన్)పై అలవోక విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లోనే ముగిసిన పోరులో మూడో సీడ్ సింధు..ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. తొలి సెట్ నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ తెలుగమ్మాయి నెట్‌గేమ్, డ్రాప్‌షాట్లు, స్మాష్‌లతో జపాన్ షట్లర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పటి వరకు ముఖాముఖి ఐదుసార్లు తలపడితే అన్నింటా సింధునే విజయం వరించింది. గురువారం 23వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సింధు..క్వార్టర్స్‌లో హీ బింగ్‌జియావో(చైనా)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 21-23, 21-15, 21-13తో వాంగ్ జు వీ(చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. మరోవైపు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 18-21, 15-21తో చెన్ యుఫీ(చైనా), సమీర్‌వర్మ 15-21, 14-21తో విక్టర్ అక్సెల్‌సన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here