ఫస్ట్ లుక్ : అల్లుడు అదిరాడుగా!!

0
248


నాగ చైతన్య హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ లుక్ విడుదలైంది. అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా గురించి ముందు నుంచి మంచి హైప్ క్యారీ అవుతూ వస్తోంది. ఇప్ప్పటి దాకా సాఫ్ట్ లవ్ స్టోరీస్ లో మాత్రమే కనిపిస్తూ వచ్చిన చైతు మొదటి సారి మంచి మాస్ టచ్ ఉన్న అల్లుడు పాత్ర చేస్తున్నాడు. 90వ దశకంలో అత్తలను ఆటపట్టించే అల్లుడిగా నాగార్జున చేసిన అల్లరి అల్లుడు-ఘరానా బుల్లోడు లాంటి సినిమాలు అప్పట్లో సూపర్ హిట్స్ గా నిలిచాయి. వాటిని తలదన్నే రీతిలో శైలజారెడ్డి అల్లుడు ఉండబోతోందని ఫాన్స్ నమ్మకం. దానికి తగ్గట్టే చాలా జాగ్రత్తగా ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేసారు. టైటిల్ కు తగ్గట్టే హీరో హీరోయిన్ లకు సమానంగా రమ్యకృష్ణకు ఇచ్చిన ప్రాధాన్యత కథలో ఆమె ఎంత కీలకమో చెప్పకనే చెబుతోంది. పక్కకు వారగా నిలబడుతూ నాగ చైతన్య-అను ఇమ్మానియేల్ దగ్గర ఉన్న స్టిల్ ను గమనిస్తే మంచి మసాలా ఉన్నట్టే కనిపిస్తోంది.

ఫస్ట్ లుక్ అంచనాలకు తగ్గట్టే  ఉందని చెప్పొచ్చు. మరీ కనివిని ఎరుగని కథ ఉండే ఛాన్స్ లేదు కానీ టాలీవుడ్ వరకు అత్తా అల్లుళ్ళ ఫార్ములా కనక సరిగ్గా డీల్ చేస్తే కాసులు కురిపిస్తుంది. అప్పట్లో అగ్ర హీరోలంతా ఈ ట్రెండ్ ను ఎంజాయ్ చేసారు. ఆ టైంలో  వాణిశ్రీ అత్త పాత్రలకు పర్ఫెక్ట్ ఛాయస్ గా కనిపించేవారు. ఇప్పుడు రమ్య కృష్ణ అందుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో రాజసం ఒలికిస్తూ దర్పం చూపిస్తున్న తీరు చూస్తుంటే మరో మంచి పాత్ర పడినట్టు కనిపిస్తోంది. ఇందులో మరో విశేషం ఉంది. నాగ చైతన్య కొత్తగా మీసకట్టుని రెండు వైపులా కాస్త పదును చేసి తిప్పినట్టు కనిపిస్తోంది. అంటే మాస్ టచ్ ఇంకాస్త ఎక్కువగా ఇచ్చారన్న మాట. థమన్ మ్యూజిక్ అందించిన శైలజారెడ్డి అల్లుడు విడుదల ఆగస్ట్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆడియో లేదా ప్రీ రిలీజ్ టైం త్వరలో  ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి శైలజారెడ్డి అల్లుడు ఊహించినట్టుగానే క్లాస్ గా మాస్ గా అదిరిపోయాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here