ఫిఫా: ఫ్రాన్స్‌లో మిన్నంటిన సంబరాలు

0
177

ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లోకి ఫ్రాన్స్ జట్టు అడుగుపెట్టడంతో ఆ దేశంలో సంబరాలు మిన్నంటాయి. దేశంలోని ఫుట్‌బాల్ అభిమానులు రోడ్లపైకి భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. బెల్జియంతో మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్ జట్టు తుది పోరుకి అర్హత సాధించింది.

1998లో తొలిసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలిచిన ఫాన్స్.. ఆ తర్వాత 2006లో ఫైనల్‌ చేరినా.. అక్కడ ఇటలీ చేతిలో అనూహ్యంగా ఓడిపోయి కొద్దిలో కప్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత రెండు పర్యాయాలు నిరాశపరిచిన ఫ్రాన్స్.. తాజాగా ఫైనల్‌కి చేరడం అక్కడి అభిమానుల్లో చెప్పలేనంత ఉత్సాహం నింపింది. బుధవారం రాత్రి ఇంగ్లాండ్, క్రొయేషియా మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ విజేతతో ఆదివారం ఫ్రాన్స్‌ ఫైనల్ ఆడనుంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here