టీ20 ప్రపంచ కప్‌కు ముందు షాక్.. కోచ్ తుషార్ రాజీనామా

0
184

టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారత మహిళా క్రికెట్‌ జట్టుకు షాక్ తగిలింది. జట్టు కోచ్ తుషార్ అరొథె రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను నిష్క్రమిస్తున్నట్లు రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆయన రాజీనామాను బీసీసీఐ వెంటనే ఆమోదించింది. మరో 5 నెలల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోచ్ తుషార్ రాజీనామా చేయడం చర్చనీయంగా మారింది. అయితే.. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసినట్లు తుషార్ చెబుతున్నప్పటికీ కొంత మంది జట్టు సభ్యుల ప్రవర్తన తీరు వల్లే ఆయన అలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

గత నెలలో ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్ పరాజయం చెందిన తర్వాత తుషార్ రాజీనామాపై పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. జట్టు సభ్యుల్లో కొంత మంది ప్రేమ వ్యవహారాలు, ఇతర విషయాలపై దృష్టి పెట్టి ఆటను నిర్లక్ష్యం చేస్తున్నారనేది కోచ్ తుషార్ ఆరోపణ. ఈ విషయంపై సదరు క్రీడాకారిణులను నిలదీయగా వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన బీసీసీఐ పెద్దల దృష్టికి కూడా తీసుకొచ్చినట్లు సమాచారం.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here