మెహ్రీన్ తో మిల్క్ బ్యూటీ

0
305

వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబోలో దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (ఎఫ్2) షూటింగ్ మొదలు కావడం ఆలస్యమైనా ఇప్పుడు మాత్రం యమా స్పీడ్ గా ఉంది. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ జానర్ లో రూపొందిస్తున్న మూవీగా ఇప్పటికే దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తర్వాత వెంకటేష్ మెగా హీరోతో నటిస్తున్న మూవీ కాబట్టి ఆ రకంగా కూడా హైప్ రెట్టింపవుతోంది. ఇక ఇందులో ఆ ఇద్దరికీ జోడిగా నటిస్తున్న మెహ్రీన్ తమన్నాలు  తామిద్దరూ తీసుకున్న సెల్ఫీ తో పాటు యూనిట్ తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ సరసన మొదటిసారి తమన్నా జట్టు కడుతుండగా సాయి ధరమ్ తేజ్ తర్వాత మెహ్రీన్ మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ఆడిపాడనుంది. హుషారైన దేవి శ్రీ ప్రసాద్ సంగీతం దీనికి ప్లస్ గా మారనుంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది తెలంగాణ స్లాంగ్ లో ఉండబోతోందని తెలిసింది. పూర్తిగా కాదు కానీ వరుణ్ తేజ్ పాత్ర మాత్రం ఆ స్లాంగ్ లోనే ఉండబోతున్నట్టు గతంలోనే లీక్ అయ్యింది. దానికి తోడు  వర్కింగ్ స్టిల్స్ లో వరుణ్ తేజ్ తో పాటు వెంకటేష్ కూడా అచ్చ మైన మిడిల్ క్లాస్ పంచెకట్టులో ఉండటం చూసి మొత్తానికి చాలా కొత్తగా ట్రై చేస్తునట్టు అయితే కనిపిస్తోంది. ఎక్కువ గ్యాప్ లేకుండా వేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరిలో విడులా చేసే ప్లాన్ లో ఉన్నారు దిల్ రాజు. ఒకవేళ అది కాదు అనుకుంటే వెంకటేష్ వరుణ్ తేజ్ లు సంక్రాంతి రేస్ లో ఉండటం ఖాయం. ఇప్పటికే బాలయ్య రామ్ చరణ్ కర్చీఫ్ వేసేసారు కాబట్టి ఇది కూడా చేరితే పోటీ పెరుగుతుంది. ఇద్దరు మిల్కీ బ్యూటీస్ ని ఒకే సెల్ఫీలో చూసుకుని ఫాన్స్ మాత్రం యమా సంబరపడుతున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here