అమెరికాలో పెద్ద సినిమాలకు దీటుగా..

0
239


హీరో కొత్తవాడు.. హీరోయిన్ కొత్తమ్మాయి.. దర్శకుడు కొత్తవాడు.. నిర్మాత కొత్తోడే. అయితేనేం ‘ఆర్ ఎక్స్ 100’ అనే చిన్న సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగలిగింది. హైప్ తెచ్చుకోగలిగింది. ఈ నెల 12న మంచి అంచనాల మధ్య ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ వారాంతానికి బరిలో ఇంకో రెండు సినిమాలున్నా.. దీనిపైనే అంచనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఇక్కడితో పోలిస్తే అమెరికాలో ఇంకా పెద్ద రేంజిలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. 120కి పైగా లొకేషన్లలో ‘ఆర్ ఎక్స్ 100’ రిలీజవుతుండటం విశేషం. అమెరికాలో వందకు పైగా లొకేషన్లలో సినిమాను విడుదల చేయడమంటే మాటలు కాదు.

స్టార్ హీరోలకు మాత్రం ఈ రేంజ్ రిలీజ్ ఉంటుంది. ఇంతకుముందు ‘క్షణం’..  ‘పెళ్లిచూపులు’..  ‘అర్జున్ రెడ్డి’.. లాంటి చిన్న సినిమాలు విడుదలకు ముందు అమెరికాలో ఇలాగే హైప్ తెచ్చుకున్నాయి. కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజయ్యాయి. ‘ఆర్ ఎక్స్ 100’ అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొత్త తరహా సినిమాలా ఉండటం.. దీని ప్రోమోలు ఆసక్తి రేకెత్తించడంతో అన్ని స్క్రీన్లు దక్కుతున్నాయి. బుధవారం ఈ చిత్రానికి ప్రిమియర్లు కూడా గట్టిగానే పడుతున్నాయి. మరి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. సినిమాకు మంచి టాక్ వస్తే సినిమా ఊహించిన రేంజికి వెళ్తుందేమో. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తికేయ-పాయల్ రాజ్ పుత్ జంటగా నటించారు. అశోక్ రెడ్డి నిర్మాత.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here