కుల్దీప్‌ని పక్కన పెడుతున్నారేంటి..?: వీవీఎస్

0
226

కుల్దీప్‌ని పక్కన పెడుతున్నారేంటి..?: వీవీఎస్

ఇంగ్లాండ్ గడ్డపై తొలి టీ20లో అత్యుత్తమ ప్రదర్శనని కనబర్చిన కుల్దీప్ యాదవ్‌ను మూడో టీ20లో తుది జట్టు నుంచి తప్పించడాన్ని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తప్పుబట్టాడు. గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ మొదలవనుండగా.. కనీసం ఈ సిరీస్‌లోనైనా తుది జట్టులో కుల్దీప్ యాదవ్‌‌‌ను కొనసాగించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కి సూచించాడు.

మాంచెస్టర్ వేదికగా ఈనెల 3న జరిగిన తొలి టీ20లో 5/24తో కెరీర్‌లో బెస్ట్ ప్రదర్శన కనబర్చిన కుల్దీప్ యాదవ్.. భారత జట్టు విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అయితే.. 6న జరిగిన రెండో టీ20లో మాత్రం అతను 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో.. గత ఆదివారం జరిగిన మూడో టీ20లో అతనిపై వేటు వేసిన టీమిండియా మేనేజ్‌మెంట్.. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌ని ఎంచుకుంది.

‘మూడో టీ20లో కుల్దీప్‌ యాదవ్‌‌కి తుది జట్టులో చోటివ్వకపోవడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. భారత జట్టుని అతను ఒంటిచేత్తో గెలిపించిన తర్వాత.. మ్యాచ్ వ్యవధిలోనే అతడ్ని పక్కన పెట్టడమా..? కనీసం .. వన్డే సిరీస్‌లోనైనా అతడ్ని తుది జట్టులో కొనసాగిస్తే మేలు. కుల్దీప్ యాదవ్‌తో పాటు.. చాహల్‌ కూడా వన్డే సిరీస్‌లో చాలా కీలకంకానున్నారు. సిరీస్ ఆరంభం నుంచి ఇంగ్లాండ్ జట్టు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నా.. భారత బౌలర్లు పుంజుకుంటున్న తీరు అమోఘం’ అని వీవీఎస్‌ లక్ష్మణ్ ప్రశంసించాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here