గ్రేహౌండ్స్‌ డీఎస్పీనంటూ బెదిరింపులు

0
193

మధురానగర్‌( విజయవాడ సెంట్రల్‌ ) : గ్రేహౌండ్స్‌ డీఎస్పీ నంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని బెదిరిస్తున్న ఇద్దరిని సత్యనారాయణపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విశాఖపట్నంకు చెందిన టి.ఆనంద సతీష్‌కుమార్‌ గాంధీనగర్‌ గరికపాటి వారి వీధిలోని  రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి  రాఘవస్వామి ద్వారా 2007లో గన్నవరంలో మూడు ప్లాట్‌లు కొనుగోలు చేశారు. ఇటీవల ఆనంద సతీష్‌కుమార్‌ ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవటంతో తాను కొనుగోలు చేసిన ప్లాట్‌లను అమ్మకానికి పెట్టారు. రాఘవస్వామి ప్లాట్‌లు అమ్మలేకపోవటంతో తన స్నేహితుడు శ్రీహర్షతో  గ్రేహౌండ్స్‌ డీఎస్పీ నంటూ రాఘవస్వామికి ఫోన్‌లు చేసి బెదిరించారు. దీంతో భయపడిన ఆయన రూ. లక్షా 40వేలు ఇచ్చారు.

ఇప్పుడు మరోమారు పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న వాహనం, బొమ్మ తుపాకీతో రాఘవస్వామి వద్దకు వచ్చి అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలని లేనిపక్షంలో చంపేస్తామంటూ బెదిరించారు. అనుమానం వచ్చిన రాఘవస్వామి సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులకు శ్రీహర్ష గ్రేహౌండ్స్‌ డీఎస్పీ కాదని తెలిసింది. నకిలీ పోలీసులని గుర్తించి శ్రీహర్షను, ఆనంద సతీష్‌కమార్‌ను  సీఐ పి.కనకారావు అరెస్టు చేశారు. పోలీస్‌స్టిక్కర్‌ల వాహనాలు, బొమ్మతుపాకీలతో పోలీసులమంటూ హడావుడి చేయటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం నుంచి వచ్చి స్థానిక వ్యాపారులను పోలీసులమంటూ బెదిరించడంపై విస్మయం చెందుతున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here