కోహ్లి అరుదైన రికార్డ్.. ఆ ఆరుగురు దిగ్గజాల సరసన కెప్టెన్

0
213

ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ గెలిచి ఉత్సాహం మీదున్న కోహ్లి సేన అదే ఊపులో వన్డే సిరీస్ బరిలో దిగింది. ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ప్రారంభమైన తొలి వన్డేలో టాస్ గెలిచిన విరాట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం నుంచి కోలుకోపోవడంతో.. భువీ మ్యాచ్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో సిద్దార్థ్ కౌల్ భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో సురేష్ రైనా‌కు కూడా అవకాశం కల్పించారు. 2015 అక్టోబర్ తర్వాత రైనా ఆడుతున్న తొలి వన్డే ఇదే కావడం గమనార్హం.

టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇది 50 వన్డే కావడం విశేషం. 50 వన్డేల్లో కెప్టెన్‌గా భారత్‌కు నాయకత్వం వహించిన ఏడో ఆటగాడు కోహ్లి. ఇప్పటి వరకూ ధోనీ, అజహర్, గంగూలీ, ద్రావిడ్, కపిల్, సచిన్ టెండుల్కర్ మాత్రమే 50కిపైగా వన్డేల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. కోహ్లి సారథ్యంలో భారత జట్టు ఇప్పటి వరకూ 49 వన్డేలు ఆడగా.. 38 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. క్లైవ్ లాయిడ్, రికీ పాంటింగ్‌లతో సమానం కోహ్లి విజయాలు సాధించడం విశేషం.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here