సూపర్‌ హీరో… రిచర్డ్‌ స్టాన్టన్‌

0
194


చియంగ్‌ రాయ్‌: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన థాయ్‌లాండ్‌ గుహ ఘటనలో బ్రిటన్‌ డైవర్‌ రిచర్డ్‌ స్టాన్టన్‌ సూపర్‌ హీరోగా అందరి అభిమానాలు అందుకుంటున్నారు. కోచ్‌ సహా ‘వైల్డ్‌ బోర్స్‌’ సాకర్‌ విద్యార్థుల బృందం.. హఠాత్తుగా వచ్చిన వరద కారణంగా గుహ లోపల చిక్కుకున్న ప్రాంతా న్ని మొదటగా గుర్తించిన స్టాన్టన్‌.. సహాయక చర్యలు ముమ్మరం కావడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈయనిచ్చిన సమాచారం ఆధారంగానే వీరిని కాపాడిన ఆపరేషన్‌ జోరందుకుంది. బ్రిటన్‌ సహా వివిధ దేశాల డైవర్లు చొరవతీసుకుని మూడ్రోజులపాటు తీవ్రంగా శ్రమించి చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. ఆపరేషన్‌ పూర్తయ్యాక థాయ్‌లాండ్‌ నుంచి బయలుదేరిన స్టాన్టన్‌ శుక్రవారం లండన్‌ చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పటినుంచి.. బాధితులంతా బయటకు వచ్చేంతవరకు జరిగిన రోమాంచిత ఘటనలను ఆయన వివరించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here