పాక్‌ ఎన్నికలు.. ఫేస్‌బుక్‌ సంచలన నిర్ణయం

0
183

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో త్వరలో జరుగునున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫేస్‌బుక్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మార్క్‌ జూకర్‌బర్గ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలపాలను పోత్సహించే సంస్థల ఖాతాలను బ్లాక్‌ చేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటన తెలిపారు. జాలై 25 నుంచి పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సహకరించాలని, చట్టబద్ధంగా నమోదు చేయని సంస్థలను రద్దుచేయాలని పాక్‌ ఎన్నికల కమిషన్‌ ఇటీవల జూకర్‌బర్గ్‌ను కోరింది. దీనిపై స్పందించిన బర్గ్‌.. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు సృష్టించే వివాదాస్పద సంస్థల పేజీలకు, ఫేక్‌ ఎకౌంట్లను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here