ఇదంతా ‘కన్నా’ కుట్ర…ఎపి అభివృద్దిని చూసి ఓర్వలేక…!:డొక్కా మాణిక్యవరప్రసాద్

0
195


అమరావతి: ఎపి ప్రభుత్వంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై ఏపీ శాసనమండలి విప్‌ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మండిపడ్డారు. సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కన్నా పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, వెల్లువలా వస్తున్న పెట్టుబడులను అడ్డుకోడానికే ఏపీలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందంటూ కన్నా కేంద్రానికి ఫిర్యాదు చేశారని డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ధ్వజమెత్తారు. అబద్ధాలతో ప్రజలను ఎలా నమ్మించాలనే విషయమై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మెమోరాండం రూపంలో ఇచ్చారని డొక్కా ఆరోపించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here