పరిపూర్ణానంద బహిష్కరణ: బీజేపీ ‘చలో ప్రగతిభవన్’ భగ్నం, ఎక్కడికక్కడ అరెస్టులు

0
157


హైదరాబాద్: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఛలో ప్రగతిభవన్‌ను పోలీసులు భగ్నం చేశారు. బీజేపీ కార్యాలయానికి వస్తున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్ట్ చేశారు. ఆయనను రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికమని ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here