ఆటోలో బెల్ట్‌షాపులకు తరలిస్తున్న మద్యం

0
147


భూపాలపల్లి: పల్లెల్లో జోరుగా బెల్టుషాపులు వెలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా తయారీకి చెక్‌పెట్టడంతో గ్రామాల్లో మద్యం దుకా ణాల జోరు కొనసాగుతోంది. మండల కేంద్రాల్లోనూ బెల్ట్‌షాపులు పుట్టుకొస్తున్నాయి. మారుమూ ల ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల వరకు ఇవి విస్తరిస్తున్నాయి. వ్యాపారులు ప్రజల ను మత్తుతో ముంచి కాసులను వెనకేసుకుంటున్నారు.

ఏజెన్సీలోని గ్రామాల్లో మద్యం దుకాణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒక్క ఏటూరునాగా రం మండలంలోనే 70 నుంచి 80 బెల్ట్‌ షాపులు వెలిశాయి. ఇంతకు ముందు అటవీ గ్రామాల్లో గుడుంబా వినియోగం ఎక్కువగా ఉండేది. ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపింది. తయారీదారులకు ప్రత్యామ్నాయంగా ఆర్థిక సాయంతో ఇతర జీవన మార్గాలను  కల్పించింది.

ప్రభుత్వ ప్రయత్నం కొంతమేరకు ఫలించినా గుడుంబా తయారీ స్థానాన్ని ప్రస్తుతం బెల్ట్‌షాపులు ఆక్రమించాయి. తాడ్వాయి, ఏటూరునాగరారం, మహదేవపూర్, ములుగు మండలాల పరిధి గ్రామాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్‌ షాపులకు మండల కేంద్రాల నుంచి మద్యం సరఫరా అవుతోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here