సెన్సార్ చిక్కుల్లో సాక్ష్యం?

0
164

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన సాక్ష్యం విడుదలకు సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉంది. దర్శకుడు శ్రీవాస్ విలన్ జగపతిబాబు ఒకటీ ఆరా ఇంటర్వ్యూలు తప్ప ప్రమోషన్ విషయంలో దూకుడు కనిపించడం లేదు. ఫాంటసీ నేపధ్యంలో రూపొందిన ఇలాంటి సినిమాలను జనం మనసులోకి రిజిస్టర్ అయ్యేలా తీసుకెళ్లడం చాలా అవసరం. కానీ సాక్ష్యం టీమ్ ఎందుకు సైలెంట్ గా ఉందా అనే అనుమానం ఫిలిం నగర్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. కానీ ప్రొడక్షన్ టీమ్ సెన్సార్ విషయంలో పడుతున్న టెన్షన్ వల్లే వాటి మీద ఫోకస్ పెట్టడం లేదని తాజా సమాచారం. సెన్సార్ కు వెళ్లిన  సాక్ష్యంలో కొన్ని జంతువులతో తీసిన సన్నివేశాలు ఉండటంతో వాటికి సంబందించిన అనుమతి పత్రాలు చూపమని అధికారులు అడగటంతో అప్పటికప్పుడు వాటిని ఇవ్వలేక కొంత సమయం అడిగినట్టు సమాచారం. చేతిలో ఉన్నది ఐదు రోజులే కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ని తెచ్చే పనిలో పడ్డారట యూనిట్ సభ్యులు. మరి ముందుగా అనుమతి తీసుకుని జంతువులను వాడారా లేక పత్రాలు ఎక్కడైనా మిస్ అయ్యాయా అనే సమాచారం రావాల్సి ఉంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here