‘కిరణ్‌, బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లోకి రావడం సంతోషం’

0
2422

విజయవాడ: కిరణ్ కుమార్‌రెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ ఊమెన్‌చాందీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోమని, ప్రజలతోనే తమ పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను అంచెలంచెలుగా బూత్‌స్థాయినుంచి బలోపేతం చేస్తామని, ఏపీలో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌ ప్రచారం చేస్తారని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లో మరికొన్ని చేరికలు ఉంటాయని, ప్రత్యేకహోదా, అభివృద్ధి అంశంపై ఎన్నికలకు వెళ్తామని ఊమెన్‌చాందీ చెప్పారు.

కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉందని, అక్టోబర్‌ 2 నుంచి ఇంటింటికీ వెళ్తున్నామని కాంగ్రెస్ నేత పళ్లంరాజు తెలిపారు. అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 19వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, కాపు రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. త్వరలో ఏపీలో రాహుల్‌గాంధీ పర్యటిస్తారని, ఆగస్టు 3న కర్నూలులో రాహుల్‌ బహిరంగ సభ నిర్వహిస్తామని పళ్లంరాజు పేర్కొన్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here