టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు ఈసీ నోటీసులు!

0
188

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ ఎస్….మహాకూటమితో టీఆర్ ఎస్ ను దెబ్బకొట్టాలని కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఓ పక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ…ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నాయి. ఏదో ఒక రూపంలో ఓటర్లను మభ్యపెట్టి వారికి తాయిలాలు సమర్పించే పనిలో నేతలంతా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లోని ఎల్లారెడ్డిలో ఓటర్లకు రవీందర్ డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలకు ఈసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here