బాలయ్య విషయంలోనే కూటమికి బీటలు పడేలా …?

0
82

 

తెలంగాణా లో ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉంది.దీనితో ఎవరికీ వారు ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెరాస మినహా మిగతా అన్ని పార్టీలకు ప్రజల్లో ఆదరణ తక్కువ ఉంది అనే చెప్పాలి.దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని ఒంటరిగా పోటీ చేస్తే తెరాస మినహా ఏ పార్టీలు ఏకగ్రీవంగా గెలవలేం అని భావించి భాజపా పార్టీ తప్పించి మిగతా ముఖ్య పార్టీలు అయినటువంటి టీటీడీపీ మరియు టీకాంగ్రెస్ లు పొత్తులు పెట్టుకున్నాయి,అంతే కాకుండా మిగతా కొన్ని పార్టీలు కూడా కలిసి ఒక మహా కూటమిలా మారి తెరాస ను ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.కానీ అయినా ఎందుకో బలం చాల్లేదు అనిపించిందేమో.

టీటీడీపీ మరియు టీకాంగ్రెస్ నేతలు వారు ప్రచారానికి వెళ్తే జనం ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారేమో జనానికి బాగా ముఖ పరిచయం ఉన్న వాళ్ళు అయితే బాగుంటుంది అని టీడీపీకి ప్రచార కార్య కర్తగా నందమూరి బాలకృష్ణను మరియు కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ గా విజయ్ శాంతిను నియమించారు.ఇప్పుడు వీరు ఎంత వరకు ఓట్లను రాబట్టగలరు అనేది ప్రశ్న?వీరి ఇరువురి ప్రభావం మరీ అంత ఎక్కువగా ఉండకపోయినా కాస్తయినా ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వీరిరువురిలో విజయ్ శాంతి విషయం పక్కన ఉంచితే బాలయ్య విషయంలోనే కూటమికి బీటలు పడేలా ఉన్నాయి.బాలయ్యకి కొంచెం కోపం ఎక్కువే అని ఇది వరకు కొన్ని సందర్భాలలో మనం చూసాము. అంతెందుకు ఈ మధ్యనే ఖమ్మం జిల్లాలోని ఎన్నికల ప్రచారానికి వెళ్ళినపుడు తన అభిమానులను ఎడా పెడా తన్నేసి మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు.దానితో ఆయన అభిమానులే బాలయ్య ఫోటోలకు,ఫ్లెక్సీలకు నిప్పంటించి నిరసనను వ్యక్తపరిచారు.బాలయ్య ఇదే పంథాని కొనసాగించినట్టైతే అసలు ఓట్లు రావడం కాదు కదా వేద్దాం అనుకున్నవాళ్ళు కూడా వెయ్యకుండా పారిపోతారు,దీన్ని బట్టి బట్టి బాలయ్య ప్రజలతో మంచిగా శాంతంగా మెలిగి జనాన్ని ఆకర్షితం చేసుకుంటే మంచిది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here