విశాఖ ఎయిర్పోర్ట్ లో వై స్ జగన్ పై కత్తి తో దాడి.. త్రుటి లో తప్పిన ముప్పు..

0
632
విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి జరిగింది. హైదరాబాద్‌ వచ్చేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్‌పై శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్ వద్దకు వచ్చిన శ్రీనివాస్.. కోడిపందేల్లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే సహాయకులు అడ్డుకోవడంతో జగన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం జగన్ హైదరాబాద్‌ బయలుదేరారు.

హత్య చెయ్యడానికి వాడిన కత్తి.

 

విశాఖ ఎయిర్పోర్ట్ లో వై స్ జగన్ పై కట్టి తో దాడి.. త్రుటి లో తప్పిన ముప్పు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here