జాక్‌ స్పారో పాత్రలో అలరించిన జానీ డెప్‌ ఇక ఆ పాత్రలో కనిపించడట..?

0
216
జానీ డెప్‌

లాస్‌ ఏంజిల్స్‌: హాలీవుడ్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా అలరించిన చిత్రం ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’. ఈ ఫ్రాంఛైజ్‌లో వచ్చిన చిత్రాలన్నీ ఆకట్టుకున్నాయి. అంతేకాదు, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరో చిత్రాన్ని డిస్నీ స్టూడియోస్‌ తెరకెక్కించనుంది. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. అయితే, గత ఐదు చిత్రాల్లో జాక్‌ స్పారో పాత్రలో అలరించిన జానీ డెప్‌ ఇక ఆ పాత్రలో కనిపించడట. తాజా చిత్రం రచయిత స్టూవర్ట్‌ బిటీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’ ఫ్రాంఛైజ్‌ డిస్నీ స్టూడియోస్‌ తిరిగి ప్రారంభిస్తున్న విషయాన్ని మొదటిసారి అధికారికంగా వెల్లడించిన స్టూవర్ట్‌.. జాక్‌ స్పారో పాత్రలో జానీ డెప్‌ ఇక కనిపించకపోవచ్చని అన్నారు. డెప్‌ వ్యవహారశైలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ‘డెడ్‌ మెన్‌ టేల్స్‌ నో టేల్స్‌’ చిత్రంలో జానీ డెప్‌ నటన మరీ తీసికట్టుగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. డైలీ మెయిల్‌టీవీలో స్టూవర్ట్‌ బిటీ మాట్లాడుతూ.. ఈ ఫ్రాంఛైజ్‌ తిరిగి ప్రారంభించడం అంటే స్పారో పాత్రలో డెప్‌ ఇక కనిపించకపోవడమే’ అని అన్నారు. ‘ఇప్పటివరకూ డెప్‌కు చాలా మంచి పాత్రే లభించింది. ఆ పాత్రను అతను చాలా చక్కగా పోషించాడు. అంతేకాదు, ఆ పాత్రతోనే అతను పేరు తెచ్చుకున్నాడు. పిల్లలందరూ స్పారో పాత్రను బాగా ఇష్టపడతారు. ఈ విషయంలో అతనికి, మాకూ కూడా గర్వంగా ఉంది. జాక్‌ స్పారో పాత్ర అతని ఆస్తి. ఐదు సార్లు ఆ పాత్రలో కనిపించాడు. ఇక అతను చేయాల్సిందల్లా ఆ పాత్రను ధరించి ఆస్పత్రిలోని పిల్లలను సంతోషపెట్టడమే’ అంటూ స్టువర్ట్‌ బిటీ చెప్పుకొచ్చారు.

 

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here