పాకిస్థాన్‌తో కలిసి సంయుక్త విజేతగా భారత్

0
170
పాకిస్థాన్‌తో కలిసి సంయుక్త విజేతగా భారత్

అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య పోరును వీక్షిద్దామనుకున్న అభిమానుల ఆశలు నెరవేరలేదు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఇరు జట్ల మధ్య ఆదివారం జరుగాల్సిన ఫైనల్ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యింది. దీంతో నిర్వాహకులు భారత్, పాకిస్థాన్‌ను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. 2011, 2016లో టైటిళ్లు గెలిచిన భారత్‌కు ఇది మూడో టైటిల్. మ్యాచ్ విషయానికొస్తే..భారత కాలమానం ప్రకారం రాత్రి 10.40లకు మొదలుకావాల్సిన మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఎంతకు గెరువు ఇవ్వకపోవడంతో ఆటకు అనుకూలంగా లేని పరిస్థితుల మధ్య మ్యాచ్‌ను రద్దు చేస్తూ ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు. అంతకుముందు హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులోమలేషియా 3-2(పెనాల్టీ షూటౌట్) తేడాతో జపాన్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో మ్యాచ్ 2-2తో స్కోరు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here