టీఆర్‌ఎస్ నేత వినోద్‌ కాంగ్రెస్‌లో చేరే అవకాశం

0
260

హైదరాబాద్: టీఆర్‌ఎస్ నేత వినోద్‌ కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు అన్ని ప్రయత్నాలు చేసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం వినోద్ ఢిల్లీలోనే ఉన్నారు. అయితే వినోద్‌ను బుజ్జగించేందుకు టీఆర్‌ఎస్ అధిష్టానం అన్ని ప్రయత్నాలు చేసింది. సోదరుడు వివేక్‌తోనూ రాయబారం నడిపించింది. అయితే వినోద్ మాత్రం టీఆర్‌ఎస్‌ను వీడాలనే నిర్ణయించుకున్నట్లు సమాచారం. చెన్నూర్‌ టికెట్ ఇస్తారనే టీఆర్‌ఎస్‌లో చేరానని కానీ, మొండిచేయి చూపారని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. వినోద్ కాంగ్రెస్‌లో చేరితే చెన్నూర్ నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ చెన్నూర్‌ అభ్యర్ధి బాల్క సుమన్‌ను ఓడించే సత్తా వినోద్‌కు ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మరోవైపు వినోద్ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇటీవల ఆయన తన సన్నిహితులతో మంచిర్యాలలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. చెన్నూర్‌ టికెట్‌ ఇవ్వకుండా టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మోసం చేసిందని ఆరోపించారు. మాజీ మంత్రినైన తనకు పార్టీలో కనీస గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులను అధిష్ఠానానికి వివరించినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అందుకే అనుచరులతో కలిసి పార్టీ మారక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. తన తమ్ముడు, ప్రభుత్వ సలహాదారు వివేక్‌.. పార్టీ మారే విషయం తనకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here