బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు డిసెంబర్ 11న ముహూర్తం కుదిరింది

0
235

లిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ తన నెక్ట్స్ సినిమాను ప్రకటించలేదు. ‘నా పేరు సూర్య’ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో బన్నీ ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఈ క్రమంలో బన్నీని ఎందరో డైరెక్టర్లు సంప్రదించినట్టు వార్తలొచ్చాయి. కానీ బన్నీ వెంటనే నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ఇటీవల వచ్చిన ‘అరవింద సమేత’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో బన్నీ అడుగులు త్రివిక్రమ్ వైపు పడ్డాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అయితే ఫిక్స్ అని తెలుస్తోంది. మరి ముహూర్తం ఎప్పుడు? ఈ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. అధికారిక ప్రకటన రావడమే తరువాయి. బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు డిసెంబర్ 11న ముహూర్తం కుదిరిందని సమాచారం. ఈలోగా ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని సినిమాను ప్రారంభిస్తారని సమాచారం.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here