డెడ్‌ సెలబ్రిటీల సంపాదనలో టాప్‌లో జాక్సన్‌..

0
1972

 

MICHAEL-JACKSON

లాస్‌ఏంజెల్స్‌: ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్స్బ్‌ ఇటీవల డెడ్‌ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మొదటిస్థానంలో పాప్‌ రారాజు మైఖేల్‌ జాక్సన్‌ , రెండవస్థానంలో మ్యూజిక్‌ లెజెండ్‌ ఎల్విస్‌ ప్రెస్లే, మూడవస్థానంలో ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు ఆర్నాల్డ్‌ పామర్‌, నాలుగోస్దానంలో ప్లేబాయి సంస్థ వ్యవస్థాపకుడు హ్యూగో హెఫ్నర్‌ , ఐదో స్థానంలో ప్రముఖ గాయకుడు బాబ్‌ మార్లేలు ఉన్నారు. ఐతే జాక్సన్‌ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ అమ్మకం ద్వారా జాక్సన్‌ పరోక్షంగా దాదాపు 400 మిలియన్‌ డాలర్లను సంపాదించాడు. జాక్సన్‌ చనిపోయి 9 ఏళ్లు అవుతున్నా సంపాదన విషయంలో ముందు స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 1.8 బిలియన్‌ డాలర్స్‌ను సంపాదించాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here