పాకిస్తాన్ పై జలయుద్ధం..

0
136

ఇటీవలి ఉగ్ర దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్న భారత్ మరో అడుగు ముందుకేసింది. ఆ దేశానికి వెళ్లే నదీ జలాలను నిలిపివేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయమై ఓ ప్రకటన చేశారు. “పాకిస్థాన్ లో ప్రవహిస్తున్న మన నీటి వాటాను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జలాలను జమ్మూ కాశ్మీర్, పంజాబ్ కు మళ్ళిస్తాం. ఇందుకోసం షాపూర్ – కంది లోరావి నదిపై డ్యామ్ నిర్మాణము ప్రారంభమైంది. కథువా లోని ఉ జ్ నదిపై నిర్మించిన డ్యామ్ లో సింధు జలాల్లో మనకు లభించే కొంత వాటాను నిల్వ చేసి కశ్మీర్ కు అందిస్తాం. మిగిలిన నీటిని రెండోరావి-బియాస్ లింకు ద్వారా ఇతర ఆధారిత రాష్ట్రాలకు మళ్ళిస్తాం.” అని గడ్కరీ ప్రకటించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here