మాకు సహాయం చేయండి.. చైనాకు పాక్ వేడికోలు!

0
79

 

భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ తో బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్ వెంటనే చైనాను సంప్రదించింది. వాయుసేన విమానాలు దాడి చేసి వెనక్కు వెళ్లిపోయిన వెంటనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మఖ్దూమ్ షా మహమ్మద్ ఖురేషీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ రంగ అధికార వార్తా సంస్థ ‘క్సిన్హువా’ స్వయంగా వెల్లడించింది.

భారత సైన్యం నిబంధనలకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖను దాటి ముజఫరాబాద్ సెక్టార్ లోకి ప్రవేశించిందని చైనాకు ఫిర్యాదు చేసిన పాక్ మంత్రి, తిరిగి దాడులు చేసేందుకు సహకరించాలని కోరగా, చైనా అందుకు అంగీకరించలేదని సమాచారం. భారత యుద్ధ విమానాలను పసిగట్టిన పాక్ ఎయిర్ ఫోర్స్ కౌంటర్ ఫైటర్ దళాలు, వాటిని తరిమేశాయని మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో బీరాలు పోయారు. వెంటనే చైనా ను సహాయం అర్థించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here