రవళి కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు

0
55

ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడ్డ వరంగల్ కు చెందిన యువతి రవళి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించింది. ఈ నేపథ్యంలో రవళి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రవళి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రవళి కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. ఆసుపత్రిలో చేరేటప్పటికి రవళి ఆరోగ్యం విషమంగా ఉందని చెప్పారు. ఆమెకు సంబంధించిన వైద్య ఖర్చులను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని వెల్లడించారు. ప్రేమోన్మాది అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

మరోవైపు గాంధీ ఆసుపత్రి వర్గాలు రవళి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశాయి. దీంతో వరంగల్ లోని స్వగ్రామం రామచంద్రపురానికి భౌతికకాయాన్ని తరలించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here