లగడపాటి రాజగోపాల్ తో మ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ

0
139

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ ఓటమే తన లక్ష్యమని చెప్పారు. జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు. మరోవైపు, టీడీపీలో రాధా చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆయన లగడపాటితో భేటీ అయినట్టు సమాచారం. తనను, తన తండ్రి రంగాను అవమానపరిచేలా జగన్ వ్యవహరించారని రాధా మధనపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున టీడీపీ నేతలు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని… తన అనుచరులు, సన్నిహితులతో చర్చించి, వారి అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా రాధా చెప్పారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here