పంత్ కు ప్రమోషన్ !

0
111

టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి విశేషంగా రాణిస్తున్న రిషబ్‌ పంత్‌కు తగిన ఫలితం లభించింది. బీసీసీఐ అతడికి ‘ఎ’ గ్రేడ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ (2018-2019) ఇచ్చింది. దీని విలువ రూ. 5 కోట్లు. 21 ఏళ్ల పంత్‌ 2017-18లో 26 మంది కాంట్రాక్ట్‌ గల ఆటగాళ్ల జాబితాలోనే లేడు. ఎ+ తర్వాత అత్యధిక మొత్తం లభించేది ‘ఎ’ గ్రేడ్‌లోనే. బీసీసీఐ నిరుడు ‘ఎ+’ విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రూ.7 కోట్లు లభించే ఈ విభాగంలోకి అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు వస్తారు. నిరుడు ఈ విభాగంలో ఐదుగురు ఉండగా.. ఈసారి ముగ్గురే ఉన్నారు. వాళ్లు కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా. భువనేశ్వర్‌, ధావన్‌లు ‘ఎ+’లో చోటు కోల్పోయారు. 2018 అక్టోబరు 1 నుంచి 2019 సెప్టెంబరు 30 వరకు కొత్త కాంట్రాక్టు అమలులో ఉంటుంది. పుజారా గ్రేడ్‌-ఏలో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హనుమ విహారికి గ్రేడ్‌ ‘సి’ కాంట్రాక్ట్‌ దక్కింది. మహిళల విభాగంలో అత్యుత్తమ గ్రేడ్‌ అయిన ‘ఎ’ గ్రేడ్‌ (రూ.50 లక్షలు)లో మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, పూనమ్‌ యాదవ్‌లకు చోటు లభించింది. తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి  రూ.10 లక్షలు లభించే గ్రేడ్‌ ‘సి’లో ఉంది.

ఎవరెవరు ఏఏ గ్రేడ్ ల్లో…

గ్రేడ్‌ ఎ+’ (రూ.7 కోట్లు): కోహ్లి, రోహిత్‌ శర్మ, బుమ్రా
గ్రేడ్‌ ’ (రూ.5 కోట్లు): అశ్విన్‌, జడేజా, భువనేశ్వర్‌, పుజారా, రహానె, ధోని, ధావన్‌, షమి, ఇషాంత్‌, కుల్‌దీప్‌, రిషబ్‌ పంత్‌
గ్రేడ్‌ బి’ (రూ.3 కోట్లు): కేఎల్‌ రాహుల్‌, ఉమేశ్‌ యాదవ్‌, చాహల్‌, హార్దిక్‌ పాండ్య
గ్రేడ్‌ సి’ (రూ.1 కోటి): కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, అంబటి రాయుడు, మనీష్‌ పాండే, హనుమ విహారి, ఖలీల్‌ అహ్మద్‌, సాహా

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here