స్త్రీ సాధికారతకు మేం కృషి చేస్తున్నాం

0
124

లోక్‌సభలో తమ పార్టీ నుంచి 35 శాతం సభ్యులు మహిళలే ఉన్నారని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గుర్తుచేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మోక్షం లభించనప్పటికీ.. తమ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. స్థానిక ప్రభుత్వాల్లోనూ 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించామని గుర్తుచేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. స్త్రీ సాధికారతకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అందుకోసం ‘స్వస్థ్య సతి’ లాంటి పథకాల్ని ప్రారంభించామన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని దీదీ ఇప్పటికే ప్రకటించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మహిళల ప్రాముఖ్యతను గుర్తుచేసుకున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here