మహర్షి ముస్తాబు..

0
79

ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాగా ‘మహర్షి’ చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు చెన్నైలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ షూటింగును పూర్తిచేశారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక మహేశ్ బాబు ప్రాణ స్నేహితుడిగా ‘అల్లరి’ నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో స్టూడెంట్ గా .. ఓ బడా సంస్థకి సీఈవోగా .. రైతుగా మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. అందువలన ఈ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మే 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here