తెలంగాణ అసెంబ్లీ లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి..

0
121

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన పోలింగ్ లో ముఖ్యమంత్రి ఓటు వేశారు. 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలింగ్ ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్ లో జరిగిన మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి వచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎమ్మెల్యేలతో కలసి బస్సులోనే వచ్చారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here