వైఎస్సార్సీపీ లోకి తోట దంపతులు

0
141

కాకినాడకు చెందిన తెదేపా ఎంపీ తోట నరసింహం దంపతులు వైకాపాలో చేరారు. ఆయనతో పాటు వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ), సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. లోటస్‌ పాండ్‌లో జగన్‌ సమక్షంలో బుధవారం వారు పార్టీ కండువా కప్పుకున్నారు.

కాకినాడ ఎంపీ తోట నరసింహం వైకాపాలో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తన భార్య వాణికి అడగ్గానే పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు వైకాపా అవకాశం ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వానికి పీవీపీ పేరును దాదాపు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here