టీఆరెస్ కార్లో వైఎస్సార్సీపీ ప్రచారం!

0
126

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు వైసీపీ-టీఆర్ఎస్ చేతులు కలిపాయని అధికార టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు బలం చేకూర్చే ఘటన ఒకటి నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతలు వాడిన కార్లు తాజాగా నెల్లూరు జిల్లాకు చేరుకున్నాయి.
వీటికి టీఆర్ఎస్ స్టిక్కర్లు తొలగించి వైసీపీ స్టిక్కర్లు, లోగోలు వేస్తున్నారు. అలాగే వాహనాలతో పాటు లోపల సీట్లపై ఉన్న టీఆర్ఎస్ పార్టీ గుర్తుతో పాటు గులాబీ రంగును మార్చుతున్నారు. ఈ కార్లతో త్వరలోనే ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here