బీదర్ వైపు అజహరుద్దీన్ చూపు!

0
76

 

తనకు విజయావకాశాలున్న పార్లమెంటు స్థానం కోసం గత కొంతకాలంగా వెదుకుతున్న ప్రముఖ క్రికెటర్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ దృష్టి పొరుగు రాష్ట్రంపై పడిందంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ నుంచి పోటీ చేసేందుకు ఆయన స్థానిక కాంగ్రెస్‌ నేత ద్వారా పావులు కదుపుతున్నారని సమాచారం. అజారుద్దీన్‌ను బీదర్‌ నుంచి పోటీ చేయిస్తే గెలుపు గ్యారంటీ అని స్థానిక కాంగ్రెస్‌ నాయకులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తుండడం ఇందులో భాగమేనని అంటున్నారు.

బీదర్‌ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు అధికం. పైగా హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతవాసులతో అక్కడి వారికి సంబంధాలు ఉన్నాయి. అందువ్ల ఈ స్థానాన్ని మైనార్టీలకు కేటాయించి అజారుద్దీన్‌ను నిలిపితే విజయం ఖాయమని పార్టీ వర్గాల భావన. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వర్‌ ఖండ్రే కూడా బీదర్‌ సీటుపై కన్నేశారు. అధిష్ఠానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. మరి అధిష్ఠానం ఆలోచన ఏమిటో తేలాల్సి ఉంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here