అందుకే వాయిదా!

0
127

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితా విడుదల వాయిదాపై పార్టీ అధినేత జగన్‌ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఆయన పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శిల్పామోహన్‌రెడ్డి, బైరెడ్డి సిద్ధార్ణరెడ్డి తదితరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయని, ఇంకా పార్టీలోకి వచ్చే వారు ఉన్నారని వివరించారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే జాబితాను చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వచ్చిందని నాయకులకు వివరించి చెప్పినట్లు సమాచారం. ఇంకా కొన్ని నియోజకవర్గాలపై కసరత్తు పూర్తికాలేదని, అన్ని అంశాలను పూర్తిచేసి ఈనెల 16వ తేదీన జాబితా విడుదల చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలిసింది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here