ఆ ఫొటో వెనుక కథ ఇదీ!

0
124

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి తొలిసారిగా మీరు చూసిన ఫోటో గుర్తుందా? ఓ సోఫాలో రాజమౌళి మధ్యలో కూర్చోగా, అటూ ఇటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నవ్వుతూ కనిపిస్తుంటారు. ఈ ఫోటో వెనకున్న నేపథ్యం గురించి రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు.

“ఓసారి నేను ఊరికి వెళుతూ ఎయిర్ పోర్టుకు వెళ్లేదారిలో రాజమౌళి హౌస్ ఉందని వెళ్లాను. ఆయన ఇంట్లోకి ఎంటరైన వెంటనే… లోపలికి వెళ్లిన తరువాత తారక్ కింద నేలపై రిలాక్స్ డ్ గా కూర్చున్నారు. ఏంటి ఈయన ఉన్నాడు ఇక్కడ? అనుకున్నాను. ఏంటి బ్రో నువ్వేంటిక్కడ? అన్నాను. నన్ను చూసిన తారక్, మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకోవాలా రాజమౌళిగారూ? నేను బయటకు వెళ్తాను అన్నాడు.

మీరేదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి. నా ఫ్లయిట్ కు ఇంకా టైముంది అన్నాను. కొంచెంసేపు రాజమౌళి ఆ సస్పెన్స్ ను అలాగే కంటిన్యూ చేసి… మీరిద్దరూ ఆగండి. అంటూ లోపలికి తీసుకెళ్లి… విషయం చెప్పారు. మా ఇద్దరికీ తెలియని అనౌన్స్ మెంట్ అది. అంత చక్కగా ఆయన కథ చెప్పడం, వెంటనే మా ఇద్దరి మొహాలనూ ఒకరిని ఒకరం చూసుకుని, వెంటనే లేచి, గట్టగా ఆయన్ను పట్టుకుని ‘మోర్ దేన్ హ్యాపీ టూ వర్క్’ అని ఒకేసారి చెప్పి, ఆ ఫోటో దిగాము” అని అన్నారు.

అది తన జీవితంలో అత్యంత మరపురాని రోజని అన్నారు. దాని తరువాత నెక్ట్స్ సెకన్ లో తీసిన ఫోటోనే ఈ సినిమా గురించి తొలిసారిగా రివీల్ అయిందని రామ్ చరణ్ చెప్పారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here