ముగిసిన వివేకా అంత్యక్రియలు

0
47

పులివెందులలో వైయస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. వైయస్ రాజారెడ్డి ఘాట్ లో ఈ ఉదయం 11 గంటలకు అంత్యక్రియలను నిర్వహించారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతిమ కార్యక్రమాలను ముగించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ సహా కుటుంబసభ్యులంతా హాజరయ్యారు.

అంతకు ముందు వివేకా నివాసం నుంచి రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమయాత్రను నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. భారీ భద్రత మధ్య అంతిమయాత్రలో జగన్ నడిచారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here