అంపైర్ తప్పుడు నిర్ణయం.. రోహిత్ శర్మ ఔట్

0
109

మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఐఎస్ బృందా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అంపైర్ అప్పుడు నిర్ణయం కారణంగా ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్‌లు మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కి 51 పరుగులు జోడించారు. అయితే హర్డస్ వేసిన 6వ ఓవర్ రెండో బంతికి రోహిత్ శర్మ(32) ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. కానీ అందుకు రోహిత్ రివ్యూ మాత్రం తీసుకోలేదు. కానీ, ఆ తర్వాత సాధారణంగా ఆ బంతిని పరిశీలించగా… అది నాటౌట్‌గా రావడం విశేషం. రివ్యూలో బంతి వికెట్ల నుంచి దూరంగా వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ రోహిత్ రివ్యూ తీసుకోకపోవడంతో అతను పెవిలియన్ చేరక తప్పలేదు. ఇక మురగన్ అశ్విన్ వేసిన 7వ ఓవర్ రెండో బంతికి సూర్యకుమార్ యాదవ్(11) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు దీంతో ముంబై ఇండియన్స్ 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజ్‌లో డికాక్(19), యువరాజ్(1) ఉన్నారు

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here