ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం: వైఎస్‌ జగన్‌

0
148

ఆర్టీసీ కార్మీకులకు జగన్‌ వరాల జల్లుచంద్రబాబు పాలనలో అంతా మోసమే

ఓటు అడిగే ధైర్యం లేక.. ఢిల్లీ నాయకులను తెచ్చుకుంటున్నారు

మడకశిర ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ ఫైర్‌

అనంతపురం జిల్లా) : అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. చంద్రబాబుకు ఐదేళ్ల తన పాలనపై ఓటు అడిగే ధైర్యం లేక ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారని విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో మోసం తప్ప ఏం జరగలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసే అబద్దపు వాగ్ధానాలకు మోసపోవద్దని కోరారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలను బీసీలకే కేటాయించామన్నారు. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.తిప్పేస్వామి, హిందూపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌లను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here