కర్నూలులో ప్రధాని సభకు వైసీపీ కార్యకర్తలు!

0
101

  • శుక్రవారం కర్నూలులో మోదీ బహిరంగ సభ
  • జెండాలు, కండువాలతో హాజరైన వైసీపీ కార్యకర్తలు
  • బారికేడ్లకు వైసీపీ జెండాలు

కర్నూలులో శుక్రవారం సాయంత్రం బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎస్టీబీసీ మైదానంలో నిర్వహించిన ఈ సభకు ప్రధాని మోదీ హాజరుకావడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు స్టేడియంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తల జేబుల్లో వైసీపీ జెండాలు, కండువాలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని పక్కనపడేసిన అనంతరం వారిని లోపలికి పంపించారు. లోపలికి వచ్చిన కొందరు వైసీపీ కార్యకర్తలు బారికేడ్లకు ఆ పార్టీ జెండాలు తగిలించారు. ఈ సభలో మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి హిందీలోకి మారారు. రాజమహేంద్రవరానికి చెందిన హిందీ ప్రొఫెసర్ సుందర్‌రామ్‌ ప్రధాని ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here