తొలి ఓవర్‌లో ఏడు బంతులు వేసిన అశ్విన్

0
21

మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఐఎస్ బృందా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగింది. అయితే బౌలింగ్‌ అటాక్‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ప్రారంభించాడు. అయితే తొలి ఓవర్‌లో అశ్విన్ ఏడు బంతులు బౌల్ చేసి అందరికి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ విషయాన్ని అక్కడి అంపైర్లు కూడా గమనించలేదు. తొలుత అంతా ఆరు బంతులుగా మాత్రమే భావించి బ్రేక్ ఇచ్చారు. అయితే బ్రేక్ తర్వాత కూడా అశ్విన్ మరో బంతిని వేయగా.. ఆ బంతిని ముంబై ఓపెనర్ డి కాక్ బౌండరీకి తరలించాడు. అయితే ఎటువంటి ఎక్స్‌ట్రా లేకుండా.. అశ్విన్ ఒక ఓవర్‌లో ఏడు బంతులు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఆరంభం నుంచి కింగ్స్ జట్టు వివాదాలకు కేంద్రంగా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ అశ్విన్, బట్లర్‌ను మన్కడింగ్‌తో ఔట్ చేసి తీవ్ర వివాదానికి తెరలేపాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో మహ్మద్ షమీ వేసిన ఓ ఓవర్‌లో కోల్‌కతా ఆటగాడు రస్సెల్ క్లీన్ బౌల్డ్‌ కాగా.. 30-యార్డ్ సర్కిల్ లోపల ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండటంతో అంపైర్ దాన్ని నోబాల్‌గా ప్రకటించారు. ఆ తర్వాత రస్సెల్ 17 బంతుల్లో 48 పరుగులు చేసి కోల్‌కతాకు భారీ స్కోర్‌ను అందించాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here