తాహిర్‌పై ధోని ప్రశంసలు

0
60

చెన్నై : ‘ జడేజా, సాంట్నర్‌ బంతిపై గ్రిప్‌ సాధించలేకపోయారు. వారిద్దరు చాలా కష్టపడాల్సి వచ్చింది. అయితే బౌలర్లను రొటేట్‌ చేసుకోగలిగాం. ఈరోజు లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ చాలా బాగా బౌలింగ్‌ చేశాడు. రిస్ట్‌ స్పిన్నర్‌ అయి ఉండి కూడా తనలా బౌలింగ్‌ చేసిన విధానం నన్నెంతగానో ఆకట్టుకుంది’ అంటూ మిస్టర్‌ కూల్‌ధోని.. చెన్నై విజయంలో తనతో పాటుగా కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్‌ తాహిర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా డిపెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా మూడో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. ఇందులో భాగంగా రాహుల్‌ త్రిపాఠి, స్మిత్‌లను పెవిలియన్‌కు చేర్చిన చెన్నై బౌలర్‌ తాహిర్‌ పర్పుల్‌ క్యాప్‌(మూడు మ్యాచుల్లో 6 వికెట్లు) దక్కించుకున్నాడు.(చదవండి : శివమెత్తిన ధోని )

ఈ క్రమంలో మ్యాచ్‌ ముగిసిన అనంతరం చెన్నై కెప్టెన్‌ ధోని మాట్లాడుతూ..‘మా జట్టులో పదకొండు మంది నిలకడగా ఆడేవాళ్లే. అయితే రాయల్స్‌ జట్టులో రైట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఉన్నారు. అందుకే హర్భజన్‌ను పక్కన పెట్టి సాంట్నర్‌కు అవకాశం ఇచ్చాం. అంతేతప్ప జట్టులో ప్రతీసారి మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. టోర్నమెంట్‌ ఆసాంతం.. ప్రత్యర్థి జట్ల బలాలు, బలహీనతల ఆధారంగా జట్టులోని ప్రతీ సభ్యుడు అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. ఇక తాహిర్‌ నిజంగా చాలా బాగా బౌల్‌ చేశాడు’అంటూ హర్భజన్‌ను పక్కన పెట్టడం పట్ల తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here