చెక్ బౌన్స్ కేసులో జైలు కు…మోహన్ బాబు

0
130

  • చెక్ బౌన్స్ కేసు వేసిన వైవీఎస్ చౌదరి
  • 2010లో కేసు వేసిన వైవీఎస్
  • ఏ1 లక్ష్మీ ప్రసన్న, ఏ2 మోహన్ బాబు

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్ బాబుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షను విధించింది. దీనికితోడు రూ. 41.75 లక్షల జరిమానాను విధించింది. సినీ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మోహన్ బాబుపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు. 2010లో ఈ అంశానికి సంబంధించి కోర్టును ఆశ్రయించారు. కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నారు. మొత్తం రూ. 48 లక్షల చౌక్ బౌన్స్ కు సంబంధించి కోర్టును వైవీఎస్ ఆశ్రయించినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ఈ అంశంపై మంచు ఫ్యామిలీ ఇంత వరకు స్పందించలేదు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here