నయన్ ప్రియుడిపై మండిపడుతోన్న నిర్మాతలు

0
86

  • నయన్ నుంచి రానున్న ‘కొలయుతిర్ కాలం’
  • అనుకున్నట్టుగా సినిమా రాలేదన్న విఘ్నేశ్ శివన్
  • వెనకడుగు వేసిన బయ్యర్లు

తమిళంలో వరుస సినిమాలతో .. విజయాలతో నయనతార దూసుకుపోతోంది. ఇక హారర్ థ్రిల్లర్ చిత్రాలకి కాసుల వర్షం కురించే ప్రధాన ఆధారంగా అక్కడ నయనతార మారిపోయింది. అలాంటి నయనతార ప్రధాన పాత్రధారిగా ‘కొలయుతిర్ కాలం’ సినిమా రూపొందింది. చక్రి తోలేటి దర్శకత్వంలో వసు భగ్నాని .. దీప్సిక దేశ్ ముఖ్ ఈ సినిమాను నిర్మించారు. నయనతార క్రేజ్ కి తగినట్టుగా ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో .. ఈ సినిమాను అనుకున్నట్టుగా తీయలేకపోయారు .. అసంపూర్తిగా అనిపిస్తోందంటూ నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ కామెంట్ చేశాడు. దాంతో ఈ సినిమాను కొనడానికి కొత్త బయ్యర్లు ముందుకు రాకపోగా, అడ్వాన్స్ ఇచ్చిన బయ్యర్లు వెనక్కి అడుగుతున్నారట. డిజిటిల్ .. శాటిలైట్ రైట్స్ కోసం పోటీపడ్డవాళ్లు .. ఇప్పుడు ఈ సినిమా హక్కులు తమకి వద్దని చెప్పేస్తున్నారట. దాంతో విఘ్నేశ్ శివన్ పై నిర్మాతలు మండిపడుతున్నారు. ఆయన కారణంగా తమకి జరిగిన డ్యామేజ్ గురించి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. తమకి జరిగిన మొత్తం నష్టాన్ని ఆయన ద్వారా ఇప్పించాలని పట్టుబడుతున్నారు. విఘ్నేశ్ శివన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here