తెలంగాణలో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం!

0
86

  • హైదరాబాద్ లోని శాలిబండలో ఘటన
  • చిన్నారికి చాక్లెట్ ఆశచూపిన కామాంధుడు
  • దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు

తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి పాతబస్తీలోని శాలిబండలో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. శాలిబండ ప్రాంతానికి చెందిన హబీబ్ హమాద్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో ఆడుకుంటున్న ఓ బాలిక(6)పై కన్నేశాడు. చాక్లెట్లు ఇప్పిస్తానని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అనంతరం లైంగికదాడికి యత్నించాడు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా బెదిరిపోయిన బాలిక.. గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడకు చేరుకోగానే నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా, నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు మరికాసేపట్లో కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here