‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో కీలకమైన పాత్రలో నిత్యామీనన్

0
50

  • చరణ్ జోడీగా అలియా భట్
  •  ఎన్టీఆర్ హీరోయిన్ కోసం అన్వేషణ
  •  నిత్యామీనన్ కి స్క్రీన్ టెస్ట్

రాజమౌళి దర్శకత్వంలో .. భారీ బడ్జెట్ తో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో చరణ్ జోడీగా అలియా భట్ ను తీసుకున్నారు. ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆమె సెట్స్ పైకి రాకముందే తప్పుకుంది. దాంతో మరో బ్రిటీష్ భామను అన్వేషించే పనిలో వున్నారు.

ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం నిత్యామీనన్ ను తీసుకునే ఆలోచనలో రాజమౌళి వున్నాడని సమాచారం. ఆల్రెడీ రాజమౌళి ఆమెకి కాల్ చేయించి బెంగుళూర్ నుంచి హైదరాబాద్ కి పిలిపించడం .. స్క్రీన్ టెస్ట్ చేయించడం జరిగిందని అంటున్నారు. రాజమౌళి డిజైన్ చేసిన ఒక కీలకమైన పాత్రకిగాను దాదాపుగా ఆమె ఖరారైపోయినట్టేనని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఈ ప్రాజెక్టులో మరో పెద్ద ఆర్టిస్ట్ భాగమైందనే చెప్పుకోవాలి.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here