త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడోసారి మహేశ్ బాబు

0
42

  • అల్లు అర్జున్ తో త్రివిక్రమ్
  • అనిల్ రావిపూడితో మహేశ్ బాబు
  • క్రేజీ కాంబినేషన్లో మరో మూవీ

త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో గతంలో ‘అతడు’ .. ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నారనేది తాజా సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమాను రూపొందించనున్నాడు. ఈ నెల చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తరువాత ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయనున్నాడు.

ఇక మహేశ్ బాబు విషయానికొస్తే .. ప్రస్తుతం ఆయన ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన అనిల్ రావిపూడితో చేయనున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఆ తరువాత త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే సహజంగానే అందరిలో ఆసక్తి ఉంటుంది. మొత్తానికి మహేశ్ బాబు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here