దేశ రాజధానిలో.. దొంగనుకొని అమాయకుడిని కొట్టి చంపేశారు!

0
114

  • ఇంటి ముందుంటే దొంగగా భావించి దాడి
  • ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే మృతి
  • ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఓ అమాయకుడిని దొంగగా భావించిన ఢిల్లీ వాసులు అతన్ని దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నిన్న రాత్రి ఉత్తర ఢిల్లీ ప్రాంతంలో ఓ వ్యక్తి, ఓ ఇంటి ముందు నిలబడి వుండటాన్ని స్థానికులు చూశారు. అతన్ని దొంగని ఆరోపిస్తూ, చుట్టుముట్టి కర్రలతో ఇష్టానుసారం చితకబాదారు. దీంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు.

విషయం తెెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించే సరికే మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరిపి, ఈ ఉదయం అతన్ని కొట్టినవారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

ఒక సమాధానం వదిలి

Please enter your comment!
Please enter your name here